
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ పూజారి యతి నరసింహానంద .. ముస్లింలను, ఇస్లాం మతాన్ని కంచపరిచేలా చేసిన వ్యాఖ్యలపై పాతబస్తీలోని ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. యూపీలోని దాస్నాదేవి ఆలయంలో యతి నరసింహానంద పూజారిగా పనిచేస్తున్నారు. మహ్మద్ ప్రవక్తపై ఆయన చేసిన వ్యాఖ్యలపై నిరసన చేపట్టాయి. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో యతి నరసింహానందకు వ్యతిరేకంగా ముస్లిం సోదరులు ప్రదర్శనలు, నిరసన చేస్తున్నారు. నరసింహానందపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం డీజీపీని కోరనుంది. యతి నరసింహానంద ముస్లింలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన ముస్లింలను, ఇస్లాం మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి.. వివాదాల్లో చేరారు. నరసింహానందపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై మొహమ్మద్ జుబైర్ అనే ఫ్యాక్ట్ చెకర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా తాను యతి నరసింహానందపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నానని, ఇంతవరకూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com