TS: హైదరాబాద్‌లో మండే ఎండలు.. 4 రోజులు జాగ్రత్త

TS: హైదరాబాద్‌లో మండే ఎండలు.. 4 రోజులు జాగ్రత్త

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మధ్యాహ్నం టెంపరేచర్ (Temparature) భగ్గమంటోంది. మండే మార్చి ఇంకా రాకముందే రాష్ట్రమంతటా ఎండలు మంటెక్కిపోతున్నాయి. ఈ ఫిబ్రవరి ప్రారంభం నుంచి టెంపరేచర్ కొంచెం కొంచెంగా పెరిగిపోతోంది.

ఫిబ్రవరి 8 గురువారం నాటికి ఉష్ణోగ్రత నలభై డిగ్రీలకు చేరువైపోయింది. ఇంకో నాలుగు రోజుల పాటు ఫుల్ టెంపరేచర్ ఉంటుందని హెచ్చరిస్తోంది వెదర్ డిపార్టుమెంట్ (Weather Department). ఆ తర్వాత ఐదారు రోజుల పాటు వాతావరణం కూల్ అవుతుంది హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు. పొద్దున, రాత్రి సమయాల్లో మాత్రం చలిగాలులు వీస్తాయని అంటున్నారు.

శని, ఆదివారాలు అంటే 10, 11 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ (Adilabad), ఆసిఫాబాద్ (Asifabad) సహా పొరుగు జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు కురిసే చాన్సుందని వివరించారు. ఫిబ్రవరి మిడ్ నుంచి.. 16వ తేదీ తర్వాత టెంపరేచర్ క్రమంగా పెరిగిపోయి సమ్మర్ వాతావరణం ఏర్పడుతుందని వెదర్ డిపార్టుమెంట్ తెలిపింది.

తెలంగాణ అంతటా ప్రధాన నగరాల్లో టెంపరేచర్ హీటెక్కుతోంది. రాజధాని హైదరాబాద్ లో (Hyderabad) మధ్యాహ్నం మాడు పగులుతోంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే.. వచ్చే మార్చి, ఏప్రిల్, మే నెలల పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉందంటున్నారు జనాలు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ తర్వాత ఎండ తీవ్రతలో పెరుగుదల కనిపిస్తోంది. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జూబ్లీహిల్స్‌లో 38.4, బంజారాహిల్స్ లో 38.39 చందానగర్‌, సరూర్‌నగర్‌ లో 38.36, బేగంపేటలో 37.7, ఉప్పల్‌లో 37.3, సెరిలింగంపల్లిలో 37.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది.

Tags

Read MoreRead Less
Next Story