Lockdown In Hyderabad : కరోనాను లెక్కచేయడం లేదు.. ఇది మన నగరవాసుల తీరు..!

Lockdown In Hyderabad : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. దీనిని అరికట్టేందుకు పలు రాష్ట్రాలు లాక్ డౌనే సరైన మార్గంగా ఎంచుకుంటున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించింది. అయితే జనాలు మాత్రం అసలు కరోనా ఉందా? లాక్ డౌన్ అమల్లో ఉందా? అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రాణం మీదికి వస్తే గాని కరోనాను ఖాతరు చేయడం లేదు.
నేడు ఆదివారం కావడంతో హైదరాబాద్ లోని చికెన్, మటన్ మార్కెట్ల వద్ద రద్దీ నెలకొంది. అక్కడికి వచ్చిన వారు కరోనా నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదు.. భౌతిక దూరం పక్కన పెడితే కనీసం మాస్కులు కూడా ధరించడం లేదు. ఇక ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి ఉన్నా.. ఆ తర్వాత కూడా తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
కేపీహెచ్ బీ కాలనీ, కుత్బుల్లాపూర్ లాంటి పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల తర్వాత కూడా చేపల విక్రయాలు కొనసాగించడంతో పోలీసులు వారి లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఇలాగే అశ్రద్ధతో, బాధ్యతారహితంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com