Hyderabad: ఇప్పటికీ పబ్‌లోకి మైనర్లకు అనుమతి.. తాజాగా మరో ఘటన..

Hyderabad: హైదరాబాద్‌లోని పబ్‌లలో అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా పార్టీలకు అనుమతిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలోని మరో పబ్‌లో మైనర్ల పార్టీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ తరహాలో మైనర్లు పార్టీ చేసుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ పబ్‌లో రెండు రోజులు పాటు పార్టీ నిర్వహించారు.
అయితే.. మొదట ఎక్సైజ్ శాఖ అనుమతి నిరాకరించింది. తీరా ఓ బడా నేత ప్రమేయంతో అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మైనర్లను పార్టీకి ఆహ్వానించారు యువకులు. సైపర్ హవర్స్ వాల్యూమ్ లెవన్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. శని, ఆదివారాల్లో మైనర్లు పార్టీలో మునిగితేలారు. అయితే.. మద్యం సరఫరా చేయలేదని పబ్ యాజమాన్యం అంటోంది.
ఇప్పటికే పబ్‌లలో మైనర్ల పార్టీలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినా.. ఎక్సైజ్ శాఖ తీరు మార్చుకోలేదంటూ పలువురు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. గచ్చిబౌలిలోని పబ్‌లో జరిగిన పార్టీలో ఎలాంటి గొడవలు జరిగినట్లుగా ఫిర్యాదు రాలేదని పోలీసులు పేర్కొంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com