HYD: హైదరాబాద్‌లో పెరిగిన రిటెయిల్ ఆకర్షణ

రిటెయిల్ స్థలాల లీజ్‌లో భారీ వృద్ధి

హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఇక్కడి భూములు, వ్యాపార సముదాయాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా రిటెయిల్‌ స్థలాల లీజింగ్‌ లావాదేవీల్లో వృద్ధి కనిపిస్తోంది. 2025లో తొలి త్రైమాసికంలో షాపింగ్‌ మాల్స్, ప్రధాన మార్గాల్లో అద్దె లావాదేవీలు బాగా పెరిగాయని స్థిరాస్థి సేవల సంస్థ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ వెల్లడించింది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అద్దె లావాదేవీలు 55శాతం పెరిగి 24.08 లక్షల చదరపు అడుగులకు చేరింది. గతేడాది ఇదే సమయంలో అద్దెకు వెళ్లిన రిటెయిల్‌ స్థలం 15.56 లక్షల చదరపు అడుగులుగా ఉంది.

హైదరాబాద్ వాటా 34%

దేశవ్యాప్తంగా మొత్తం లీజింగ్‌ లావాదేవీల్లో హైదరాబాద్‌ వాటా 34 శాతం (8 లక్షల చ.అడుగులు)గా ఉంది. గతేడాదితో పోలిస్తే 106% వృద్ధి నమోదైంది. ఇందులో ప్రధాన మార్గాల్లో 90% స్థలాలు అద్దెకు వెళ్లాయి. కొత్తపేట్, నల్లగండ్ల, కొంపల్లి వంటి శివారు ప్రాంతాల్లోనూ భారీగా గిరాకీ కనిపించింది. మొత్తం లావాదేవీల్లో 24% వాటాతో జూబ్లీహిల్స్‌ మొదటి స్థానంలో ఉంది. ఫ్యాషన్, ఆరోగ్య సంరక్షణ, ఫుడ్ విభాగాల్లో డిమాండ్ అధికంగా ఉంది. ఇక్కడ లీజింగ్‌ లావాదేవీల్లో 98% దేశీయ బ్రాండ్‌లకు సంబంధించినవే ఉన్నాయి.

ఈ ప్రాంతాల్లో రిటెయిల్ హబ్‌లు

నగరంలోని గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, టోలిచౌకిలలో కొత్త పైవంతెనలు, రహదారి విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాల మెరుగదల వల్ల రిటెయిల్‌ ఆకర్షణ పెరిగిందని నివేదికలో వెల్లడైంది. సంప్రదాయ మాల్స్‌తోపాటు, గృహ-వాణిజ్య మిశ్రమ వినియోగ స్థలాల్లోనూ కొత్త రిటెయిల్‌ హబ్‌లు విస్తరిస్తున్నాయని పేర్కొంది. మిగిలిన 3 త్రైమాసికాల్లో సుమారు 70 లక్షల చ.అడుగుల వరకు కొత్త స్థలం అందుబాటులోకి రానుందని తెలిపింది. హైస్ట్రీట్స్‌లో రిటైల్ స్పేస్ లీజింగ్ 3.44 మియన్ల చదరపు అడుగులు నుంచి 3.82 మిలియన్ల చదరపు అడుగులకు చేరగా.. షాపింగ్ మాల్స్‌లో తగ్గినట్లు తెలిపింది. షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ లీజింగ్ 1.85 మిలియన్ల చదరపు అడుగుల నుంచి 1.72 మిలియన్ల చదరపు అడుగులకు తగ్గినట్లు పేర్కొంది. మొత్తంగా రిటైల్ స్పేస్ లీజింగ్ గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5 శాతానికిపైగా పెరిగిట్లు నివేదిక వెల్లడించింది.

Tags

Next Story