Hyderabad Rain: మరోసారి ముంచెత్తిన భారీ వర్షం.. అధికారుల అప్రమత్తం..

Hyderabad Rain: వరుణుడు భాగ్యనగరంలోపై మరోసారి విరుచుకుపడుతున్నాడు. అర్ధరాత్రి నుంచి నగరంలోని పలుప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, కోఠిలో భారీ కుండపోత కారణంగా ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. ఇటు ఓల్డ్ సిటీ, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట్, చైతన్యపురి, సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్, సైదాబాద్‌లోనూ అదే పరిస్థితి.
మలక్‌పేట్‌లో అయితే నాలాలు పొంగిపోర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇవాళ కూడా నగరంలోని అనేక ప్రాంతాలతో పాటు, పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com