సరదాగా రాశాడు.. ర్యాంకు కొట్టేశాడు

సరదాగా రాశాడు.. ర్యాంకు కొట్టేశాడు
పోటీ పరీక్షలంటే ఎంత ప్రిపరేషన్ ఉండాలి. కాంపిటీషన్ తట్టుకోవాలంటే పుస్తకాల పురుగైపోవాల్సిందే..

పోటీ పరీక్షలంటే ఎంత ప్రిపరేషన్ ఉండాలి. కాంపిటీషన్ తట్టుకోవాలంటే పుస్తకాల పురుగైపోవాల్సిందే.. అలాకాకుండా ఆడుతూ పాడుతూ చదివామంటే ర్యాంకు వేలల్లో కాదు లక్షల్లో వస్తుంది. కానీ సిద్ధార్థకు కంప్యూటర్ బ్రెయిన్ ఉందేమో.. తన టార్గెట్ ఒకటైనా మరో దానికి ఎంట్రన్స్ రాశాడు.. దానిలో కూడా ఆశ్చర్యకరంగా పదో ర్యాంకు సాధించాడు. హిమాయత్ నగర్ కు చెందిన ప్రీతం డాక్టర్ చదువు మీద ఇష్టంతో ఇటీవల నీట్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఈలోగా ఖాళీగా ఉండడం ఎందుకనుకున్నాడో ఏమో.. ఎంసెట్ కూడా రాసేసాడు. నిన్న విడుదలైన ఫలితాల్లో పదో ర్యాంకు రావడం చూసి తాను కూడా ఆశ్చర్యపోయాడు. అయితే తన లక్ష్యం వైద్య విద్యను అభ్యసించడమే అని అన్నాడు. సిద్ధార్ధ్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా డాక్టర్లే కావడం విశేషం. తండ్రి న్యూరో సర్జన్ అయితే, తల్లి గైనకాలజిస్ట్ గా సేవలందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story