హైదరాబాద్ SBI ఏటీఎంలో చోరీ

X
హైదారాబాద్ వనస్థలిపురంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. మొత్తం 5 మంది ముఠా సభ్యులు... కారులో వచ్చి చోరీ చేశారు. దుండగుల్లో ఒకరు ఏటీఎంలోకి గ్యాస్ కటర్‌తో వెళ్లినట్లు సీసీ దృశ్యాల్లో రికార్డు అయ్యాయి.
6 పోలీసు టీంలు దొంగల కోసం గాలిస్తున్నాయి. దుండగులు ఏటీఎం నుంచి ఎంత మొత్తం దోచుకెళ్లారనేది తెలియాల్సి ఉంది. 4 ఏళ్ల క్రిందట ఇదే ఏటీఎంలో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఏటీఎంలో అలారం లేకపోవడంతో రెండో సారి కూడా చోరి జరిగినట్లు భావిస్తున్నారు. పాత నేరస్థులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
