Ice Cream Effect: స్విగ్గీలో ఐస్ క్రీం ఆర్డర్ ఇచ్చాడు.. తిన్న కాసేపటికే మృత్యుఒడిలోకి

Ice Cream Effect: కరోనా సీజన్ అయినా అన్ని ఫుడ్ కోర్టులు నిర్థేశించిన సమయంలో పని చేస్తున్నాయి. ఆర్డర్ చేసిన కస్టమర్లకు ఫుడ్ అందిస్తున్నారు డెలివరీ బాయ్ లు. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు స్విగ్గీలో ఐస్ క్రీం ఆర్డర్ చేశాడు.
అది తిన్న కాసేపటికే అతడికి వాంతులు, విరోచనాలు పట్టుకున్నాయి. కాసేపటికే యువకుడు మృతి చెందాడు. నాచారం పీఎస్ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సాయి సంపత్ అనే యువకుడు ఆన్ లైన్లో ఐస్ క్రీం ఆర్డర్ చేశాడు.
స్విగ్గీ ద్వారా 1 కేజీ స్కూబ్ ఐస్ క్రీం తెప్పించుకున్నాడు. అయితే అది తిన్న కాసేపటికే అస్వస్తతకు గురై మృతి చెందాడు.
ఈ మేరకు తండ్రి మల్లేశం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
సంపత్ మృతికి ఐస్ క్రీం కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంపత్ కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com