సెప్టెంబర్ 7నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ తిరిగి ప్రారంభం

పరుగులు తీసేందుకు మెట్రో ట్రైన్ సిద్ధమైంది. ఈ నెల 7వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ తిరిగి ప్రారంభం కానుంది. మెట్రో రైళ్ల పున ప్రారంభంపై మెట్రో MD NVS రెడ్డి, L&T MD KVB రెడ్డి సమీక్షా సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.. ప్యాసింజర్‌లను బట్టి ఫ్రీక్వెన్సీ పై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.. మెట్రో స్టేషన్‌లతో పాటూ రైళ్లలో భౌతిక దూరం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, భౌతిక దూరాన్ని సీసీ టీవీల ద్వారా పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నారు..
మెట్రో ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేయనున్నారు. మాస్క్ లేకపోతే ఫెనాల్టీలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా లక్షణాలు లేని వాళ్లకు మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతి ఇవ్వనున్నారు. అలాగే మెట్రో ఉద్యోగుల కు పిపిఇ కిట్లు ఇవ్వాలని నిర్ణయించారు. స్మార్ట్ కార్డు, క్యాష్ లెస్ విధానంలో టికెట్లు జారీ చేయనున్నారు.
హైదరాబాద్‌లో మెట్రో సేవలు దశ వారిగా ప్రారంభం కానున్నాయి. ఒకటవ దశ కారిడార్ 1 మియాపూర్ నుండి ఎల్బి నగర్ వరకు, రెండో దశ సెప్టెంబర్ 8 నుంచి కారిడార్ 3 నాగోల్ నుండి రాయ దుర్గ్ వరకు.. మూడో దశ పెప్టెంబర్ 9 నుంచి మూడు కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి ఐదు నిమిషాలకు ఒక మెట్రో ట్రైన్ నడపనున్నారు. గాంధీ హాస్పిటల్, భరత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్ యూసుఫ్ గూడ స్టేషన్ల మూసివేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com