HYDRA: హైడ్రా సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం: రంగనాథ్‌

HYDRA: హైడ్రా సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం: రంగనాథ్‌
X

యా­కు­త్‌­పు­రా­లో ఐదే­ళ్ల బా­లిక పా­ఠ­శా­ల­కు వె­ళ్తూ ప్ర­మా­ద­వ­శా­త్తూ మ్యా­న్‌ హో­ల్‌­లో పడి­పో­యిన ఘట­న­పై హై­డ్రా కమి­ష­న­ర్ రం­గ­నా­థ్ స్పం­దిం­చా­రు. ఆ బా­లి­క­ను నా­య­న­మ్మ, స్థా­ని­కు­లు సు­ర­క్షి­తం­గా కా­పా­డా­రు. హై­డ్రా సి­బ్బం­ది ని­ర్ల­క్ష్యం వల్లే ప్ర­మా­దం జరి­గిం­ద­ని వి­మ­ర్శ­లు రా­వ­డం­పై రం­గ­నా­థ్‌ స్పం­దిం­చా­రు. హై­డ్రా వల్లే తప్పు జరి­గిం­ద­ని గు­ర్తిం­చా­మ­ని, ఘట­న­కు బా­ధ్యు­లైన సి­బ్బం­ది­పై చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని తె­లి­పా­రు. ‘‘నగ­రం­లో ఉన్న మ్యా­న్‌­హో­ల్స్‌­పై ఆడి­ట్‌ చే­స్తు­న్నాం. మూ­త­లు సరి­గా­లే­ని­వి గు­ర్తిం­చి.. సం­బం­ధిత ఏజె­న్సీ­కి సె­క్ర­ట­రీ ద్వా­రా రి­ఫ­ర్‌ చే­స్తాం. జీ­హె­చ్‌­ఎం­సీ, వా­ట­ర్ బో­ర్డు, హై­డ్రా మధ్య ఎలాం­టి సమ­న్వయ లోపం లేదు. బ్లే­మ్‌ గే­మ్‌ కా­కుం­డా సమ­న్వ­యం­తో ముం­దు­కె­ళ్లా­లి. యా­కు­త్‌­పు­రా ఘట­న­పై రా­జ­కీ­య­ప­రం­గా చేసే వి­మ­ర్శ­ల­పై స్పం­దిం­చ­ను. భవి­ష్య­త్‌­లో మళ్లీ ఇలాం­టి ఘట­న­లు పు­న­రా­వృ­తం కా­కుం­డా చూ­సు­కుం­టాం. మా­న్‌­సూ­న్‌ ఎమ­ర్జె­న్సీ టీ­మ్‌ ఇన్‌­ఛా­ర్జి ని­న్న జరి­గిన ఘట­న­కు బా­ధ్యు­డు.. అత­ని­పై చర్య­లు తీ­సు­కుం­టాం." అని రం­గ­నా­థ్ తె­లి­పా­రు.

బతుకమ్మ పండగ అక్కడే..

అన్ని విభాగాలకు బాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారని, మాకు శాంక్షన్ అయిన బడ్జెట్ లో ఒక క్వార్టర్ ది మాత్రమే రిలీజ్ అయిందని తెలిపారు. హైడ్రా పోలీస్ స్టేషన్ లో త్వరలో కేసులు నమోదు చేస్తామన్నారు. సున్నం చెరువులో పనులు ఆపమని కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ లేదన్నారు. బతుకమ్మ కుంట పనులు పూర్తవబోతున్నాయని, త్వరలో సీఎం ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట ప్రారంభిస్తామని చెప్పారు. ఈసారి బతుకమ్మ పండగ అక్కడ జరిగేలా ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు.

మూడు రోజులు భారీ వర్షాలు

వా­య­వ్య బం­గా­ళా­ఖా­తం­లో అల్ప­పీ­డ­నం ఏర్ప­డిం­ది. దీని ప్ర­భా­వం­తో రా­ష్ట్రం­లో రా­ను­న్న మూడు రో­జుల పాటు అక్క­డ­క్క­డా పి­డు­గు­ల­తో కూ­డిన మో­స్త­రు నుం­చి భారీ వర్షా­లు పడే అవ­కా­శం ఉం­ద­ని ఏపీ రా­ష్ట్ర వి­ప­త్తుల ని­ర్వ­హణ సం­స్థ తె­లి­పిం­ది. ము­ఖ్యం­గా ఉత్త­రాం­ధ్ర జి­ల్లా­ల్లో భారీ వర్షా­లు కు­రి­సే అవ­కా­శం ఉం­ద­ని అం­చ­నా వే­సిం­ది. ప్ర­జ­లు అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని సూ­చిం­చిం­ది. బయ­ట­కు వచ్చే­వా­రు జా­గ్ర­త్త­లు తీ­సు­కో­వా­ల­ని సూ­చిం­చిం­ది. తె­లం­గా­ణ­లో­నూ భారీ వర్షా­లు కు­రి­సే అవ­కా­శం ఉంది. అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని అధి­కా­రు­లు సూ­చిం­చా­రు.

Tags

Next Story