HYDRA: అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు

HYDRA: అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు
X
క్రమంగా దూకుడు పెంచుతున్న హైడ్రా... ఫిర్యాదు చేసేందుకు ఫోన్ నెంబర్

హైదరాబాద్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఆదివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 100 అడుగుల రోడ్డులోని 5 అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. ఇక్కడ ప్రధాన రహదారిని ఆనుకొని ఐదు అంతస్తుల భవనం ఉంది. దీన్ని శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. భవన యజమానికి గతేడాది జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. ఈ నిర్మాణం అక్రమమని ఇప్పటికే హైకోర్టు తేల్చింది.

మరో భవనానికి హైడ్రా ముహూర్తం ఖరారు

హైదరాబాద్ జిల్లా మాదాపూర్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని నేడు హైడ్రా అధికారులు కూల్చివేయనున్నారు. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న 6అంతస్తుల భవనాన్ని కూల్చివేయనున్నారు. ఇప్పటికే బిల్డర్ను పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో స్థానికుల ఫిర్యాదుతో ఫీల్డ్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనిఖీ చేశారు. కాగా.. అనుమతులు లేవని తేలడంతో కూల్చివేతకు హైడ్రా కమిషనర్ ఆదేశించారు.

హైడ్రాకు ఫిర్యాదు చేయాలా కాల్ చేయండి

ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. రాణిగంజ్లోని బుద్ధ భవన్లో ఉన్న హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 2 గం. వరకు.. మధ్యాహ్నం 3 గం. నుంచి సాయంత్రం 5:30. వరకు నేరుగా లేదా 040-29565758, 29560596 నంబర్ కు ఫిర్యాదు చేయాలన్నారు.

మంత్రులను, డీజీపీని కలిసిన హైడ్రా కమిషనర్

మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డీజీపీ జితేందరను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిశారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైడ్రా తీసుకోబోయే చర్యలపై విస్తృతంగా చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. చట్టపరంగానే చెరువులు, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తామన్నారు.

Tags

Next Story