hydra: హైడ్రాపై హైకోర్టు సీరియస్

అక్రమ నిర్మాణాల పేరుతో నివాస గృహాలను కూల్చడంపై తెలంగాణ హైకోర్టు మరోసారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (హైడ్రా)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సున్నం చెరువు పరిసరాల్లో నివాస గృహాలను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ పౌరులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ నిర్వహించిన హైకోర్టు, "ఇల్లు కూల్చడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి" అంటూ గట్టిగా వ్యాఖ్యానించింది. పిటిషనర్లు సమర్పించిన పత్రాల్లో ఎలాంటి లోపాలూ లేవని స్పష్టంచేసిన న్యాయస్థానం, హైడ్రా తీరును తప్పుబట్టింది. సర్వేలు జరపకుండా, ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) ను అధికారికంగా నిర్ధారించకుండా అక్రమ నిర్మాణాల పేరుతో చర్యలు చేపట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. "ఎన్ని సార్లు చెప్పినా మీరు మారడం లేదేంటి?" అంటూ హైడ్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం, సున్నం చెరువు పునరుద్ధరణకు సంబంధించిన అనుమతులు పొందేందుకు దరఖాస్తు చేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశించింది. అలాగే తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి కూల్చివేతలు చేపట్టకూడదని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com