HYDRA: వందేళ్ల ప్రణాళికతో దూసుకుపోతున్న హైడ్రా

హైడ్రాపై మరింత స్పష్టత రావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన *మీట్ ది ప్రెస్* కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హైడ్రా రెండు మూడు సంవత్సరాలకు పరిమితం కాదని, వందేళ్ల ప్రణాళికతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం ఆరు చెరువుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కొన్ని చెరువులను సీఎస్‌ఆర్ పేరుతో ఆక్రమించడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకున్నామని తెలిపారు. సాంకేతిక ఆధారాలతో ఎఫ్‌టీఎల్ మార్కులు వేస్తున్నామని, చెరువుల వద్ద భూముల ధరలు కోట్లు పలుకుతున్నా వాటిని కాపాడేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రాజకీయ ఉద్దేశంతో హైడ్రా పని చేయడం లేదని, విపత్తుల నుంచి ప్రజలను రక్షించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ వరకు ఉన్న చెరువులపై ఈ ఏడాదిలో తుది నోటిఫికేషన్ జారీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కూకట్‌పల్లి నల్ల చెరువు పునరుద్ధరణ ప్రజల నమ్మకానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. హైడ్రాకు అందరూ సమానమే. ఫాతిమా కాలేజ్ అయినా.. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు అయినా ఒకేలా చూస్తాం” అని రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రాకు ప్రభుత్వం నుంచి చాలా సపోర్ట్ ఉందని.. సీఎం సహా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు చాలా సహకరిస్తున్నారని అన్నారు. వరదల్లో కొన్ని ప్రాంతాల్లో సివరేజ్ మురుగు వస్తుందని.. అలాంటి విషయాల్లో పరిష్కారం కోసం పని చేయడం ముఖ్యమని భావిస్తున్నామని అన్నారు. హైడ్రా పీఎస్ కూడా త్వరలో యాక్టివ్ అవుతుందని చెప్పారు.
హైడ్రాపై మరిత క్లారిటీ రావాలి..
హైడ్రాపై ఇప్పటికే చాలా మందికి అవగాహన వచ్చిందని, ఇంకొంతమందికి క్లారిటీ రావాల్సి ఉందని రంగనాథ్పేర్కొన్నారు. వందేండ్ల ప్లాన్ తో ముందుకు వెళుతున్నామన్నారు. హైడ్రా పరిధిలో 60 నుంచి 65 శాతం చెరువులు మాయమయ్యాయని, సీఎస్ఆర్ పేరుతో కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని, కొట్టేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సాంకేతిక ఆధారాలతో మార్కు చేస్తున్నామని, ఇప్పటికే చెరువుల వద్ద భూముల ధరలు రూ.కోట్లు పలుకుతున్నాయన్నారు. ప్రస్తుతం ఆస్తులు కొనుగోలు చేసేవారు కూడా జాగ్రత్త పడుతున్నారని, దీనికి కారణం హైడ్రానే అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com