HYDRA: రూ.3,600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన 'హైడ్రా

భాగ్యనగరంలో హైడ్రా అధికారుల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వరుసగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శనివారం కొండాపూర్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కొండాపూర్లోని బిక్షపతి నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా సిబ్బంది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల వద్దకు మీడియాని పోలీసులు అనుమతించం లేదు. రెండు కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఆపరేషన్ కొండాపూర్
ఆర్టీఏ కార్యాలయం పక్కనే ఉన్న భిక్షపతి నగర్ ఏరియాలో ఆపరేషన్ కొండాపూర్ హైడ్రా చేపట్టింది. సర్వే నంబర్ 59లో ఉన్న ఈ 36 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కొంతమంది వ్యక్తులు ఆక్రమించారు. తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. వ్యాపార కార్యకలాపాలు చేపట్టారు. దీనిపై హైడ్రాకు అనేక ఫిర్యాదులు వచ్చారు. ఈ ఫిర్యాదులతో కదలిన అధికారులు చర్యలకు ఉపక్రమింంచారు. పకడ్బందీగా ఆక్రమణలు తొలగించారు. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. అయితే ఈ విచారణలో భాగంగా ఆక్రమణలు తొలగించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా సిబ్బంది ఈ ఆక్రమణల తొలగింపును అత్యంత పకడ్బందీగా చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు, ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పూర్తి బందోబస్తుతో ఆపరేషన్
పూర్తి బందోబస్తుతో ఆపరేషన్ చేపట్టిన హైడ్రా అధికారులు ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించలేదు. దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో కారిడార్లు ఏర్పాటు చేశారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించారు. అది ప్రభుత్వ భూమి అని చెప్పే బోర్డులు ఏర్పాటు చేశారు. చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. కొండాపూర్ ప్రాంతం హైదరాబాద్ నగరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత విలువైన స్థిరాస్తి మార్కెట్లలో ఒకటి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నంబర్ 59లోని ఈ 36 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ దాదాపు రూ. 3,600 కోట్లు ఉంటుందని అంచనా.
హైకోర్టు తీర్పుతోనే కూల్చివేతలు
కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి సమీపంలోని సర్వే నంబర్ 59లో 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంత మంది కబ్జా చేశారని హైడ్రా తెలిపింది. దీనిపై గతంలో రైతులకు అనుకూలంగా రంగారెడ్డి జిల్లా సివిల్ కోర్టు తీర్పు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. దీంతో ఉన్నత న్యాయస్థానం సర్కార్ రేవంత్ సర్కార్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ 36 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు మేరకు కొండాపూర్ లోని బిక్షపతి నగర్ ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణల తొలగింపును భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది చేపట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com