Sonu Sood: నేను శాఖాహారిని .. నా పేరుతో మటన్ షాపా: సోనూ సూద్ రిాయాక్షన్

Sonu Sood: అందరి బంధువు భద్రాచల రాముడైతే ఆదుకునే ప్రభువు సోనూ సూద్ అయ్యాడు ప్రస్తుతం. కరోనా సీజన్ మొదలైనప్పటి నుంచి తన సేవలు కొనసాగిస్తున్నాడు. మొదటి విడత కరోనా వచ్చినప్పుడు వలస కూలీలను వారి స్వస్థలాలకు చేరవేశాడు.
ఇప్పుడు కొనసాగుతున్న రెండవ సీజన్ లో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మిస్తూ, అవసరమైన వారికి కాన్సన్ ట్రేటర్లను పంపిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నాడు. అందరి అభిమానాన్ని సంపాదించుకుంటున్న సోనూ సూద్ కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు.
ఆయన అభిమాని తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తాను ప్రారంభించిన మటన్ షాపుకి సోనూ సూద్ పేరు పెట్టుకున్నాడు. ఈ విషయం సోనూ దృష్టికి వచ్చింది. దాంతో సోనూ నేను శాఖాహారిని అయితే నాపేరున మాంసాహార దుకాణమా అంటూ చమత్కరించారు. మీ దుకాణానికి నేనేమైనా సహాయం చేయగలనా అని ట్వీట్ చేశారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో మొదటి ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన ఆయన, జూన్ నెలాఖరులో ఆత్మకూరు, నెల్లూరులో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ భారతదేశానికి మద్దతునిచ్చే సమయం ఇదే అని సోనూసూద్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com