Revanth Reddy: ఇసుక దోపిడిని చూపించడానికే ఇక్కడకు వచ్చా..: రేవంత్ రెడ్డి

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కొనసాగుతుంది. జమ్మికుంటలో ఇసుక క్వారీలను పరిశీలించారు ఆయన. ఇసుక దోపిడిని చూపించడానికే ఇక్కడు వచ్చానన్న రేవంత్, అక్రమ తరలింపును ప్రశ్నించిన వారిని భయపెడుతున్నారని అన్నారు.. అక్రమార్కులకు సీఎం కేసీఆర్ సహకారం ఉందని విమర్శించారు. యాత్ర ఫర్ చేంజ్ పేరుతో పాదయాత్ర చేస్తున్న ఆయన మార్గ మధ్యలో ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ.. విమర్శలు గుప్పించారు. అలాగే తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో వివరించారు. సంపూర్ణ మార్పు కోసమే యాత్ర చేపట్టామని ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిదని కామెంట్ చేశారు రేవంత్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com