CONGRESS: "ఆరు హామీలతో" కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం

CONGRESS: ఆరు హామీలతో కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం
హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌ ఎన్నికల శంఖరావం... ఆరు హామీలు ప్రకటించిన సోనియాగాంధీ

విశ్వసనీయతనే అజెండాగా జరిగిన తుక్కుగూడ విజయభేరి సభలో కాంగ్రెస్ నిబద్ధతను ప్రజలకు గట్టిగా చెప్పే ప్రయత్నంచేసింది. రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి మాటలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటున్నట్లు స్పష్టంచేస్తూ వచ్చారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం మధ్య ఆరు హామీల గ్యారంటీ కార్డును కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం హైదరాబాద్‌ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించింది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ పోరు కోసం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాల్లో వ్యూహం ఖరారుచేసిన కాంగ్రెస్‌ నాయకత్వం.. తుక్కుగూడ సభా వేదికగా తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలుచేసే ఆరు గ్యారంటీలను ప్రకటించింది. స్వయంగా ఆరు వాగ్దానాలను ప్రకటించిన సోనియాగాంధీ స్వరాష్ట్ర ఆకాంక్షలు సాకారమయ్యేలా తెలంగాణను మరింత ఉన్నతస్థానానికి తీసుకెళ్లేలా కాంగ్రెస్‌కు మద్దతు పలకాలని కోరారు.


రానున్న తెలంగాణలో ఎన్నికల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌... హైదరాబాద్‌ తుక్కుగూడ విజయభేరి సభావేదికగా సమరభేరి మోగించింది. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సహా అగ్రనేతలు ఈ సభకు హాజరయ్యారు. ముందుగా బోయిన్‌పల్లిలో కాంగ్రెస్‌ ఐడియాలజీ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజల నడుమ సోనియాగాంధీ తెలంగాణలో అధికారంలోకి వస్తే.. అమలుచేయనున్న ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం కింద అందించే హామీలను ప్రకటించారు. మహిళలకు ఈ పథకం కింద నెలకు 2వేల 500 రూపాయలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పేద మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. ఆరు గ్యారంటీల్లో ప్రతి ఒక్కహామీని అమలు చేస్తామని సోనియా ప్రకటించారు.

ప్రజల ఆకాంక్షలు పోరాటాలను చూసిన స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కాంగ్రెస్‌... తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందని సోనియాగాంధీ తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చిన సోనియా... అనంతరం వేదిక దిగి నుంచి వెళ్లిపోయారు. తర్వాత మిగిలిన గ్యారంటీలను పార్టీనేతలు ప్రకటించారు. ఇందులో భాగంగా రైతు భరోసా పథకం కింద రైతులు, కౌలురైతులకు కలిపి ఎకరానికి 15 వేలు, వరి క్వింటాలుకు 5 వందల బోనస్‌ ఇస్తామని AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు. , ఏకకాలంలో 2 లక్షల రుణ మాఫీ అందిస్తామని స్పష్టం చేశారు.


గృహజ్యోతి పథకం కింద ఇంటి అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇంటి పథకం కింద గృహ నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం, యువ వికాసం పథకం ద్వారా విద్యార్థులకు 5 లక్షల రూపాయలతో విద్యా భరోసా కార్డు ఇవ్వనున్నట్లు నేతలు ప్రకటించారు. చేయూత పథకం కింద 4వేల పింఛన్‌, దళిత, గిరిజన బంద్ కింద 12 లక్షలు, అధికారంలోకి రాగానే.. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఆరు గ్యారంటీలలో కాంగ్రెస్‌ వెల్లడించింది

గృహజ్యోతి పథకం కింద ఇంటి అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇంటిస్థలం, గృహ నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యమకారులకు 200 గజాల ఇంటి స్థలం, యువ వికాసం పథకం ద్వారా విద్యార్థులకు 5 లక్షల రూపాయలతో విద్యా భరోసా కార్డు, తెలంగాణ ఇంటర్‌నేషనల్‌ పాఠశాలలు ఇవ్వనున్నట్లు నేతలు ప్రకటించారు. చేయూత పథకం కింద 4వేల పింఛన్‌, 10లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా, దళిత, గిరిజన బంద్ కింద 12 లక్షలు, అధికారంలోకి రాగానే.. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఆరు గ్యారంటీలలో కాంగ్రెస్‌ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story