Malla Reddy: ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు..

Malla Reddy: ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు..
Malla Reddy: ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడిని సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో ఐటీ అధికారులు కొట్టించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Malla Reddy: ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడిని సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో ఐటీ అధికారులు కొట్టించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి పరిస్థితి సీరియస్‌గా ఉందంటూ చెప్పుకొచ్చారు.



మహేందర్‌రెడ్డికి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ అందుతుంటే.. తన కొడుకును కనీసం చూడడానికి కూడా అనుమతించడం లేదని విమర్శించారు. మహేందర్ రెడ్డిని ఐటీ అధికారులు రాత్రంతా ఇబ్బంది పెట్టినట్టు ఉన్నారని మండిపడ్డారు. తాము ఎవరిని దగా చేయడం లేదని, స్మగ్లింగో, క్యాసినోనో ఆడటం లేదని, ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.


మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఈ ఉదయం ఛాతిలో నొప్పిరావడంతో వెంటనే ఆయనను సూరారంలోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే కుమారుడిని చూసేందుకు మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రికి వెళ్లారు.



ఈ సందర్భంగా ఐటీ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దుర్మార్గ పాలన చేస్తోందని మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు ఆసుపత్రి వద్దకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి.


ఇప్పుడు చేస్తున్న దాడులకు ప్రతిదాడులు తప్పవంటూ ఫైర్ అయ్యారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్. ప్రజల మద్దతుతో గెలిచిన నాయకుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని మండిపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మహేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే వివేక్‌ పరామర్శించడానికి వెళ్లారు.



మరోవైపు మంత్రి మల్లారెడ్డికి మద్దతుగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, ఎల్‌.రమణ మల్లారెడ్డి హాస్పిటల్‌కు చేరుకున్నారు. ఆ తరువాత అందరూ కలిసి ఒకే కారులో ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.


మరోవైపు మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్‌, మెడికల్‌, ఫార్మసీ కాలేజీల్లో తనిఖీలు చేపడుతున్నారు. యూనివర్సిటీ, ఆస్పత్రి, ఇతర వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల ముందు నుంచే అధికారులు ఈ తనిఖీలకు ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. దాడుల విషయాన్ని ఐటీ శాఖ అత్యంత గోప్యంగా ఉంచింది.

Tags

Read MoreRead Less
Next Story