ALLU ARJUN: పోలీసు విచారణకు హాజరైన అల్లు అర్జున్

ALLU ARJUN: పోలీసు విచారణకు హాజరైన అల్లు అర్జున్
X
వెంట తండ్రి అల్లు అరవింద్... భార్య స్నేహ భావోద్వేగం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంధ్య థియేటర్ ఘటనలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొనగా బన్నీ కాసేపటి క్రితం విచారణకు హాజరయ్యారు. అయితే బన్నీకి ఆరోగ్యం బాగోలేదని.. తన లీగల్ టీమ్‌ను పంపనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ బన్నీ విచారణకు హాజరయ్యాడు. ఈ క్రమంలో బన్నీని ఏసీపీ రమేశ్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీలు విచారించనున్నారు. కేసు కోర్టు పరిధిలో ఉండడంతో అప్రమత్తంగా వ్యవహరించాలని ఏసీపీ రమేశ్ కుమార్ తెలిపారు. కాగా, చిక్కడపల్లి పీఎస్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.

వరుసగా 5 రోజులు విచారణకు అల్లు అర్జున్?

అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నందున కేసు విచారణ కోసం పోలీసులు నేరుగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. సాధారణంగా జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, పోలీసులు నిందితుడిని కస్టడీకి తీసుకోవాలని నిర్ణయిస్తారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌లో ఉండడంతో ఆయనను 4 నుంచి 5 రోజులపాటు విచారించడానికి అవకాశం ఉన్నట్టు చర్చలు జరుగుతున్నాయి

అడిగే ప్రశ్నలు ఇవేనా..?

ఎంతమంది బౌన్సర్లను నియమించుకున్నారు..?

పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు..?

రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా ..?

ఎంతమంది కుటుంబ సభ్యులు సినిమాకు వచ్చారు..?

రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది..?

రేవతి మరణ విషయం తెలీదని ఎందుకున్నారు..?

వెళ్లేటప్పుడు అభివాదం ఎందుకు చేయాల్సి వచ్చింది..?

Tags

Next Story