GHMC: చెత్త బయట పడేస్తే.. రూ.1000 ఫైన్ : జీహెచ్‌ఎంసీ

GHMC: చెత్త బయట పడేస్తే.. రూ.1000 ఫైన్ : జీహెచ్‌ఎంసీ
X
GHMC: ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తుంటారు.. ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోరు. పరిసరాల పరిశుభ్రత కోరుకుంటారు కానీ తమ వంతు కర్తవ్యంగా ఏం చేస్తున్నామన్నది ఆలోచించరు..

GHMC: ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తుంటారు.. ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోరు. పరిసరాల పరిశుభ్రత కోరుకుంటారు కానీ తమ వంతు కర్తవ్యంగా ఏం చేస్తున్నామన్నది ఆలోచించరు.. అందుకే జీహెచ్‌ఎంసీ ఇకపై ఇష్టానుసారం చెత్తపడేస్తే రూ.1000లు ఫైన్ కట్టాలని ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ మేరకు నగరంలో బోర్డులు ఏర్పాటు చేసింది.

నిత్యం చెత్త పోగవుతున్న 1200 ప్రాంతాలను గుర్తించింది. అక్కడ మొక్కలు నాటడం, రంగులు వేయడంతో పాటు పౌరుల్లో అవేర్‌నెస్ తీసుకువచ్చే పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ యంత్రాగాన్ని ఆదేశించారు. ఈ మేరకు పారిశుద్ధ్య ఇంజనీర్లు, వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. చెత్త తొలగించిన చోట మళ్లీ వేస్తే జరిమానా వేస్తామని బోర్డులు ఏర్పాటు చేశారు.

Tags

Next Story