వరద ప్రభావిత ప్రాంతాల్లో.. మంత్రి కేటీఆర్ పర్యటన

కుంభవృష్టితో అతలాకుతలమైన హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో.. వరుసగా మూడోరోజు మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఖైరతాబాద్‌లోని బీఎస్ మక్త కాలనీలో GHMC ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్‌ను ఆయన పరిశీలించారు. తాత్కాలికంగా అక్కడ ఆవాసం పొందుతున్నవారికి అందుతున్న సౌకర్యాలపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఈ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే దానంతోపాటు.. GHMC ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరద పరిస్థితుల్లో అవసరమైనవారందరికీ.. రేషన్ కిట్లతోపాటు..
ఇతర అన్ని సౌకర్యాలను అందించేందుకు GHMC ప్రయత్నిస్తోందన్నారు కేటీఆర్ . వర్షాలు తగ్గి కాలనీలు వరద నుంచి తేరుకుంటున్న నేపథ్యంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు. తాగునీరు విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. కాచివడపోసిన నీటిని తాగాలని కేటీఆర్ సూచించారు. ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాన్ని అందిస్తామన్నారు. షెల్టర్ హోమ్ లో ఉన్న వారందరికీ ఇప్పటికే ఆహారంతోపాటు దుప్పట్లు మందులు ఇస్తున్నారు కేటీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com