ఢిల్లీ నుంచి 'బండి' రిటర్న్..

ఢిల్లీ నుంచి బండి రిటర్న్..
నిన్న అధిష్టానం పిలుపు తో ఢిల్లీ కి సంజయ్.. అధ్యక్షుడి మార్పుపై జోరుగా చర్చ

నిన్న అధిష్టానం పిలుపు తో ఢిల్లీకి వెళ్లిన బండి సంజయ్ ఈ రోజు తిరిగి హైదరాబాదుకు వస్తున్నారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో అధ్యక్షుడి మార్పుపై జోరుగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లో అధ్యక్షుడి మార్పు పై ఎలాంటి చర్చ జరగడం లేదని ఈ వార్తలన్నీ మీడియా సృష్టే అని బండి వర్గం కొట్టిపారేస్తోంది. అయితే అక్కడ జరిగిన కేబినెట్ మీటింగ్ లో అధ్యక్షుడి మార్పుపై స్పష్టత రాలేదు. అధ్యక్షుడి మార్పు పై క్లారిటీకి మరో పదిరోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. క్షేత్ర స్థాయి పరిస్థితులపై అధిష్టానం కు తప్పుడు సమాచారం అందడంతోనే గందరగోళం నెలకొందని బండి వర్గీయులు పేర్కొంటున్నారు.


Tags

Next Story