Telangana New High Court : నేడు హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన

Telangana New High Court : నేడు హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన

Telangana High Court : తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి నేడు సీజేఐ చంద్రచూడ్ శంకుస్థాపన చేయనున్నారు. రంగారెడ్డి(D) బుద్వేల్‌లో సాయంత్రం 5.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. హైకోర్టు నిర్మాణానికి వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. పాత భవనాన్ని చారిత్రక కట్టడంగా పరిరక్షిస్తూ సివిల్ కోర్టు అవసరాలకు వినియోగించనున్నారు.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదేతో సమా వేశం సందర్భంలో కొత్త భవన నిర్మాణానికి భూమిని కేటాయించేందుకు సిఎం రేవంత్ సుముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో భూమి కేటాయింపు కోరుతూ న్యాయశాఖ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

తెలంగాణ హైకోర్టులో 2009లో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పట్లోనే పాతబస్తీ నుంచి హైకోర్టును తర లించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. హైకోర్టు నిర్మాణానికి బుద్వేల్‌తో పాటు చంచల్‌ గూడ సమీపంలోని ప్రింటింగ్ ప్రెస్ ప్రాంగణం, సోమాజిగూడ, హైటెక్ సిటీ ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు.

Tags

Read MoreRead Less
Next Story