ఓయూలో స్విమ్మింగ్‌పూల్, పార్క్ ప్రారంభోత్సవం..!

దేశంలో క్రీడలపై ఆసక్తి కలిగిన యువతను మరింత ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం 26 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసే సింథటిక్ పార్క్, స్విమ్మింగ్ పూల్‌ను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోకలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. కేవలం ఉస్మానియా యూనివర్సిటీకే 13 కోట్లు 50లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీకి ఏ సాయం కావాలన్నాఅందించేందుకు సిద్ధమని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నామని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో పోలీస్ పాంప్లెట్స్ నిర్మిస్తున్నామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com