కాంగ్రెస్‌లోకే ఆ ముగ్గురు

కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ మాజీ నేతల చేరికపై క్లారిటీ వచ్చింది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఈ నెలాఖరులో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ భారత్‌కు తిరిగి వచ్చాక ముగ్గురు నేతలు ఆయనతో స్వయంగా భేటీ కానున్నారు. ఈ నెల 22న రాహుల్ భారత్‌కు తిరిగొస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
నెలాఖరున ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. నాగర్‌కర్నూలులో జరిగే సభలో జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీలో చేరనున్నారు. మరో వైపు జూపల్లి కృష్ణారావుతో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ సమావేశమయ్యారు. జూపల్లి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలతో.. అదే ఉమ్మడి జిల్లాకు చెందిన సంపత్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో టీజేఎస్ చీఫ్ కోదండరాం పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై ముగ్గురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com