Telangana : తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీలు పెంపు..!

Telangana : తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీలు పెంపు..!
Telangana : తెలంగాణలో 14 శాతం విద్యుత్‌ ఛార్జీల పెంపునకు ఈఆర్సీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.

Telangana : తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. 14 శాతం విద్యుత్‌ ఛార్జీలను పెంచుతూ ఈఆర్సీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే 19 శాతం పెంపునకు డిస్కంలు అనుమతి కోరాయి. డొమెస్టిక్‌ మీద 40 పైసల నుంచి 50 పైసలు పెంచనున్నారు. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి చొప్పున పెరగనుంది. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపారు ఈఆర్సీ ఛైర్మన్‌ శ్రీరంగరావు.

గతంలో కంటే 38.38 శాతం అధికంగా ప్రతిపాదన వచ్చిందన్నారు. వ్యవసాయానికి విద్యుత్‌ టారిఫ్‌ పెంచలేదని స్పష్టం చేశారు. ఈవీ ఛార్జింగ్‌కు టారిఫ్‌ ప్రతిపాదనలు ఆమోదించలేదన్నారు. డిస్కంలు నవంబరు 30లోపు ప్రతిపాదనలు కమిషన్‌ ముందు ఉంచాలని ఆదేశించామని తెలిపారు. 2022-23 ఏడాదికి డిస్కంలు ప్రతిపాదించిన రెవెన్యూ గ్యాప్‌ 16వేల కోట్లని తెలిపారు. కానీ 14వేల 237 కోట్ల రెవెన్యూ గ్యాప్‌ను కమిషన్‌ ఆమోదించిందన్నారు.

ఏఆర్‌ఆర్‌ ప్రతిపాదనలను కమిషన్‌ 48వేల కోట్లు ఆమోదించిందని వెల్లడించారు. ఇక.. జీడిమెట్ల స్మార్ట్‌ గ్రిడ్‌ పూర్తి స్థాయిలో విస్తరించాలని సూచించామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story