Telangana: తెలంగాణలో ఘనంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు: సీఎం కేసీఆర్

Telangana: తెలంగాణలో ఘనంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు: సీఎం కేసీఆర్
Telangana: దేశ భక్తి ఉట్టిపడేలా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి.

Telangana: దేశ భక్తి ఉట్టిపడేలా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను సీఎం కేసీఆర్‌.. హైదరాబాద్‌ హెచ్‌సీసీ వేదికగా జాతీయ జెండా ఆవిష్కరించి శ్రీకారం చుట్టారు. వాడవాడలా.. గ్రామగ్రామాన స్వతంత్ర కాంక్ష రగలాలన్నారు సీఎం కేసీఆర్‌.

తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ వజ్రోత్సవాలను ప్రారంభించింది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జాతీయ జెండాను ఎగరవేశారు సీఎం కేసీఆర్‌. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేశారు.

Telangana: సుదీర్ఘ కాల స్వయంపాలనలో భారతదేశంలో తరాలు మారుతున్నాయని.... స్వాతంత్ర్య పోరాట సమయంలో జరిగిన సంఘటనలు కొత్త తరానికి తెలియవని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గాంధీజీని కించపరిచే మాటలు వింటున్నామని.. ఆ వ్యాఖ్యలు చాలా బాధ కలిగిస్తున్నాయన్నారు. అలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.

మన చరిత్రను మనమే తప్పుగా చేసుకునే స్థితిలో ఉన్నామన్నారు సీఎం కేసీఆర్‌. జాతిని చీల్చేందుకు ప్రయత్నించే కొన్ని చిల్లర చేష్టలను తిప్పికొట్టాలన్నారు. జాతిని, దేశాన్ని కాపాడుకోవాలని... అవసరమైతే తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో పోరాడేందుకు సిద్ధం కావాలన్నారు.

గత కొన్నేళ్లుగా కేంద్ర పాలలకు... నాటి స్వాతంత్ర్య ఉద్యమకారుల స్ఫూర్తికి వ్యతిరేకంగా నడుస్తున్నారని అన్నారు రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దిగజారుతుందన్నారు. మత విధ్వేషాలు పెరుగుతున్నాయన్నారు. మతల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కేంద్రంపై ఆరోపణలు చేశారు కేకే.

ఈ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే 75 మంది వీణ కళాకారులచే చేపట్టిన వీణా వాయిద్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశ భక్తి ప్రతిధ్వనించేలా కార్యక్రమాలు నిర్వహించారు.

తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15న ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రభుత్వం 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేయనుంది. ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో వేడుకల ముగింపు కార్యక్రమం ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story