SLBC: కార్మికులను రక్షించేందుకు భారత సైన్యం

SLBC: కార్మికులను రక్షించేందుకు భారత సైన్యం
X
రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎస్ఎల్బీసీ ప్రమాదంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కూలిన టన్నెల్ పూర్తిగా బ్లాక్ అయిపోయిందని మంత్రి తెలిపారు. టన్నెల్ కూలిన ఘటనలో ఎనిమిది మంది కార్మికులు గల్లంతయ్యారని వెల్లడించారు. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉత్తమ్ వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పిస్తున్నామని.. భారత సైన్యంతో కూడా మాట్లాడామని ఆయన తెలిపారు. టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు భారత సైన్యం ప్రమాదాస్థలికి చేరుకుంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎస్‌ఎల్‌బీసీలో పనులు ప్రారంభం అయ్యాయి.. ఒక దగ్గర చిన్న క్రాక్ ఏర్పడి.. ఒక్కసారిగా కులడంతో ప్రమాదం సంభవించినట్లుగా మంత్రులు తెలిపారు. బోర్ మిషన్ ముందు కొంతమంది.. కుడి.. యడమల పక్కన మరికొందరు.. వెనకాల కొంతమంది కార్మికులు వెళుతుండగా 14 కిలోమీటర్ వద్ద 8 మీటర్ల మేరా మట్టికూలి టన్నెల్ మూసుకుపోయిందని మంత్రులు తెలిపారు.

గల్లంతయిన 8 మందిలో ఇద్దరు అమెరికన్లు

ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనలో లోపల చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రమాదంలో గల్లంతయిన వారిలో ఇద్దరు అమెరికన్లు కూడా ఉన్నారన్న దానిపై ఎలాంటి స్పష్టత రాలేదని మంత్రి వెల్లడించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ పనులు మొదలు పెట్టిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని ఉత్తమ్ తెలిపారు.

పూర్తి బాధ్యత రేవంత్‌దే: కేటీఆర్

ఎస్ఎల్బీసీ టన్నెల్‌ ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్ దే అని వ్యాఖ్యానించారు. సుంకిశాల ఘటన మరువకముందే మరో దుర్ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యమే అని విమర్శించారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. SLBC ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags

Next Story