WOMENS DAY: నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆవిష్కరణ

WOMENS DAY: నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆవిష్కరణ
X
పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మందితో సభ... కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో లక్ష మంది మహిళల సమక్షంలో ఇందిరా మహిళా శక్తి మిషన్‌–2025ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి మిషన్‌-2025ను సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరిస్తారు. సెర్ప్‌, మెప్మాలను విలీనం చేసి కోటి మంది మహిళలకు రూ. లక్ష కోట్ల రుణం అందించడమే మహిళా శక్తిమిషన్-2025 ఉద్దేశ్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలను ఎస్‌హేచ్‌జీల పరిధిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లను విలీనం చేయనున్నారు. ఇందిరా మహిళా శక్తి మిషన్‌–2025 పాలసీకి తెలంగాణ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా కొత్త పాలసీకి ప్రభుత్వం రూపకల్పన చేసింది. పరేడ్‌ గ్రౌండ్స్‌ సభకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆధ్యక్షత వహిస్తారు.

మిషన్ ప్రధాన లక్ష్యమిదే

ఇందిరా మహిళా శక్తి మిషన్‌– ప్రధాన లక్ష్యం సెర్చ్, మెప్మా సంస్థలను విలీనం చేసి కోటి మంది మహిళలకు రూ. లక్ష కోట్ల రుణం అందించడం. దీనివల్ల స్వయం సహాయ సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరుగుతుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. ఈ స్కీమ్ కింద మహిళలకు రుణ సౌకర్యాలు, సబ్సిడీలు, బీమా పథకాలు, వ్యాపారోద్ధరణ అవకాశాలు కల్పించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మహిళల ఆధ్వర్యంలో నడిచే 150 అద్దె బస్సులను ప్రారంభించనున్నారు. అలాగే 31 జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త పెట్రోల్ బంకులను ప్రారంభించే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి సభలో స్పష్టం చేయనున్నట్లు సమాచారం.

Tags

Next Story