తెలంగాణలో జూలై1 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం..!

తెలంగాణలో జులై 1నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభమవుతాయని.. బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు ఒకరోజు ప్రత్యక్ష తరగతలు, మరోరోజు ఆన్‌లైన్ క్లాసులు ఉంటాయని పేర్కొన్నారు. జులై 1న మొదటి సంవత్సరం విద్యార్థులకు, జులై 2న రెండో సంవత్సరం విద్యార్థులు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. జులై 2 మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు జరుగుతాయని వివరించారు. విద్యా సంవత్సరం మొత్తం ప్రత్యక్ష తరగతులతో పాటు.. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. ఇక జూన్ 25 నుంచి లెక్చరర్లు కాలేజీలకు రావాల్సి ఉంటుందని ఉమర్ జలీల్ తెలిపారు. 70శాతం సిలబస్‌తోనే ఈ ఏడాది నిర్వహించే యోచనలో ఉన్నామని ఉమర్ జలీల్ తెలిపారు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆధారంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు మార్కులు వేస్తామని ఉమర్ జలీల్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com