ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ గడువు పొడిగించిన తెలంగాణ స్టేట్ బోర్డ్..

తెలంగాణ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి గడువు పొడిగించారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) 2023-24 విద్యా సంవత్సరానికి జూలై 31, 2023 వరకు అడ్మిషన్లు తీసుకోవచ్చని ప్రకటించింది. అంతేకాకుండా, రూ. 500 ఆలస్య రుసుముతో ఆగస్టు 1 నుండి 16 వరకు అడ్మిషన్లు పొందవచ్చు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, కో-ఆపరేటివ్, టిఎస్ రెసిడెన్షియల్, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూల్స్, కెజిబివిలు, జూనియర్ కళాశాలలతో సహా రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సులను అందిస్తున్న వివిధ కళాశాలలను బోర్డు ఆదేశించింది. అంతే కాకుండా కాంపోజిట్ డిగ్రీ కళాశాలలు, పొడిగించిన గడువులోపు అడ్మిషన్లు నిర్వహించాలని ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com