BRS: బీఆర్ఎస్‌లో రేగుతున్న అసంతృప్తి జ్వాలలు

BRS: బీఆర్ఎస్‌లో రేగుతున్న అసంతృప్తి జ్వాలలు
అధిష్టానాన్ని టార్గెట్ చేసిన టికెట్‌ దక్కని నేతలు; ఇతర పార్టీ నుండి ఓడించి తీరుతామంటూ వార్నింగ్‌

రోజురోజుకు బీఆర్‌ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు పెరుగుతున్నాయి. టికెట్ దక్కని నేతలు అధిష్టానాన్ని టార్గెట్ చేశాయి. ఇతర పార్టీ నుండి ఓడించి తీరుతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా చెన్నమనేని రమేష్, వేముల విరేశంతోపాటు రేఖా నాయక్‌ బీఆర్ఎస్‌ను వీడే యోచనలో ఉన్నారు. పౌరసత్వ వివాదంతో చెన్నమనేని రమేష్‌కు కేసీఆర్ టికెట్‌ కేటాయించలేదు. నేడు జర్మనీ నుంచి వేములవాడకు రానున్నారు చెన్నమనేని రమేష్. అయితే ఇప్పటికే చెన్నమనేని రమేష్‌కి టచ్‌లో వెళ్లారు తెలంగాణ బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ బీజేపీ నేతల్ని కలవనున్న సమాచారం.

మరోవైపు ఖానాపూర్ టికెట్‌ దక్కకపోవడంతో ఎమ్మెల్యే రేఖా నాయక్‌ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. బీఆర్ఎస్‌ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు ఆమె. మార్టీ మారేందుకు డిసైడ్‌ అయ్యారు. అయితే ఎన్నికల వరకు బీఆర్ఎస్‌లోనే ఉంటానంటూ తేల్చి చెప్పారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అలర్ట్‌ అయిన రేఖా నాయక్.. ఖానాపూర్‌ సెగ్మెంట్ కోసం కాంగ్రెస్‌కు దరఖాస్తు చేశారు. ఆమె పీఏ దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ తనను మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే వేముల విరేశం తీవ్ర ఆరోపణలు చేశారు. ఇన్నాళ్లు అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి, నిబద్దతో పనిచేస్తే టికెట్ ఇవ్వకుండా ద్రోహం చేశారంటూ మండిపడుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నుంచి తప్పకుండా బరిలో ఉంటానంటూ ధీమా వ్యక్తం చేశారు.

Tags

Next Story