T BJP: తెలంగాణ బీజేపీలో..అయోమయం

T BJP: తెలంగాణ బీజేపీలో..అయోమయం
పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను మారుస్తారంటూ కొందరు నేతలు తొలుత లీకులు ఇవ్వడంతో మొదలైంది ఈ వ్యవహారం.

తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది. దూకుడుగా ఉన్న కమలం పార్టీ అధికార బీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టగలిగే శక్తి సామర్థ్యాలు బీజేపీకే ఉన్నాయని జనం విశ్వసించే స్థితికి చేరుకుంది. కానీ, నెల రోజుల వ్యవధిలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను మారుస్తారంటూ కొందరు నేతలు తొలుత లీకులు ఇవ్వడంతో మొదలైన ఈ వ్యవహారం రోజురోజుకూ ముదిరి అయోమయ పరిస్థితులకు దారితీసేదాకా వచ్చింది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఏకంగా అధిష్ఠానంపైనే ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టడం సంచలనం సృష్టించింది. తాను ఏ వ్యాఖ్యలూ చేయలేదని, అనని మాటలు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆ తరువాత రఘునందన్‌ చెప్పినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.మధ్యాహ్నం మీడియాతో చిట్‌చాట్‌లో సంచలన ఆరోపణలు చేసిన రఘునందన్ ఆ తర్వాత గంటల వ్యవధిలోనే మాట మార్చేశారు. తాను అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేశారంటూ మీడియాను తప్పుపట్టే ప్రయత్నం చేశారు.

Tags

Next Story