Irani Chai: భారీగా పెరిగిన ఇరానీ ఛాయ్ ధర.. ఇక ఛాయ్ తాగేదెలా!

Irani Chai: ప్రస్తుతం నిత్యావసరాల వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కూడా ఇండియాలోని ధరలపై ప్రభావం చూపిస్తోంది. ఒక మామూలు మిడిల్ క్లాస్ వ్యక్తి భరించలేనంతగా ధరలు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ లాంటివాటి ధరలే పెరుగుతున్నాయి అనుకునేలోపు హైదరాబాదీలకు ఎంతో ఇష్టమైన ఇరానీ ఛాయ్ ధర కూడా త్వరలోనే పెరగనుందని యజమానులు షాక్ ఇస్తున్నారు.
హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఫుడ్ మెనులో ధరలను సవరించే పనిలో పడ్డాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండడంతో హోటళ్ల యాజమాన్యానికి కూడా ధరలు పెంచడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. అంతే కాకుండా కూరగాయలు, వంట నూనె ధర కూడా మునుపటికంటే చాలా ఎక్కువగా పెరిగిపోయింది. దీంతో ఫుడ్ మాత్రమే కాదు ఛాయ్ ధరపై కూడా ఎఫెక్ట్ పడింది.
హైదరాబాద్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ.. దాని తర్వాత ఎక్కువగా గుర్తొచ్చేది ఇరానీ ఛాయ్. ఇరానీ ఛాయ్ అంటూ చాలామంది హైదరాబాదీలకు ఇష్టం. అయితే ఇప్పటివరకు ఇరానీ ఛాయ్ ధర రూ. 15గా ఉండేది. కానీ పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని దీని ధర రూ. 20కు పెంచాలని హోటళ్లు నిర్ణయించాయి. ఇరానీ చాయ్‌పత్తా ధర కిలో రూ.300 నుంచి రూ.500కు పెరగడం, నాణ్యమైన పాలు లీటరు రూ.100కు చేరడం.. ఇరానీ ఛాయ్ ధరపై ఎఫెక్ట్ చూపించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com