REVANTH: రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను వందేళ్లలో చక్కదిద్దలేనంత విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. భారాస ఎన్నికల మేనిఫెస్టో.... కాంగ్రెస్ అమలు చేస్తున్న ఆరు పథకాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సంక్షేమ పథకాలలో పారదర్శకత కోసమే రేషన్ కార్డ్ అర్హతగా నిర్ధారించామన్న రేవంత్ ...... లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందనిఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.
బీఆర్‌ఎస్, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో, కాంగ్రెస్ గ్యారంటీలుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పదేళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆక్షేపించిన సీఎం.. ఇంతవేగంగా తెలంగాణను దివాళా తీయించిన ఘనత ఆయనకే దక్కుతుందని విమమర్శించారు. మోదీని మరోసారి ఎందుకు గెలిపించాలో కిషన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించిన ముఖ్యమంత్రి.. రాష్ట్రానికి ఏం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చూస్తామన్న రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని పునురుద్ఘాటించారు. పదేళ్లలో కేసీఆర్ విధానాల వల్ల తెలంగాణ ఆర్థికంగా దివాళా తీయడమే కాకుండా ఏటా 70 వేల కోట్ల వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్ ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్ వందేళ్లలో చక్కదిద్దలేనంత విధ్వంసం చేశారని మండిపడ్డ ముఖ్యమంత్రి.. 75 రోజులుగా నిరంతరం తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దటం గురించే ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్, బీజేపీ పదేళ్ల ఎన్నికల మేనిఫెస్టో, కాంగ్రెస్ అమలుచేస్తున్న ఆరు గ్యారెంటీలపై శాసనసభ వేదకగా చర్చకు సిద్ధమా? అని రెండు పార్టీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సింగరేణి కార్మికులకు కోటి ప్రమాద బీమా పథకాన్ని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. రెండు పార్టీలపై విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి ఓడ్లడిగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో కొలబద్దగా రేషన్‌కార్డును తీసుకోవడాన్ని సీఎం సమర్థించుకున్నారు. అసలైన అర్హులను గుర్తించేందుకు రేషన్‌కార్డును ప్రాతిపదికగా తీసుకున్నట్లు పునరుద్ఘాటించారు. సింగరేణి కార్మికులకు కోటి బీమా పథకం చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క.. సింగరేణిని మరింత పరిపుష్టం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెజ్డ్ సెంటర్ నిర్మించాలని యోచిస్తున్నామన్న ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com