25 Nov 2022 9:35 AM GMT

Home
 / 
తెలంగాణ / Malla Reddy: ఒకప్పుడు...

Malla Reddy: ఒకప్పుడు పాలవ్యాపారి.. ఇప్పుడు మెడికల్ కాలేజీలకు అధిపతి: మంత్రి మల్లారెడ్డి గుట్టు బయటపెట్టనున్న ఐటీ

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Malla Reddy: ఒకప్పుడు పాలవ్యాపారి.. ఇప్పుడు మెడికల్ కాలేజీలకు అధిపతి: మంత్రి మల్లారెడ్డి గుట్టు బయటపెట్టనున్న ఐటీ
X

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లోనూ భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.తన ఇంట్లో 100 కోట్ల రూపాయల బ్లాక్‌‌మనీ ఉన్నట్టు రాసుకున్నారంటూ మంత్రి మల్లారెడ్డి ఇప్పటికే మీడియా ముందు గొల్లుమన్నారు. మంత్రి 100 కోట్ల రూపాయల వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా.. పెద్దనోట్ల కట్టలు బయటపడ్డాయి. అంటే.. నిజంగానే ఐటీ అధికారుల స్టేట్‌మెంట్లో 100 కోట్ల బ్లాక్‌మనీ ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.


మంత్రి మల్లారెడ్డి ఆర్థిక మూలాలన్నీ బయటకు తీస్తున్నారు ఐటీ అధికారులు. భూకబ్జాలు, అక్రమాలు, ఆక్రమణలతో మల్లారెడ్డి వేల కోట్లు వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇదే విషయం మాట్లాడుకుంటుంటారు.ఇక మల్లారెడ్డి కాలేజీల్లో ఫీజులు, డొనేషన్ల పేరుతో వసూళ్లు, ఫీజుల విషయంలో విద్యార్ధులకు ఎదురయ్యే వేధింపులకైతే అంతే లేదనేది బయట టాక్. అసలు మల్లారెడ్డి కాలేజీలో చదవాలంటే లక్షలకు లక్షలు పోయాల్సిందేనని చెప్పుకుంటుంటారు. అలాంటిది తమ కాలేజీల్లో పేద విద్యార్ధులను చదివిస్తున్నాం అని మంత్రి మల్లారెడ్డి నుంచి ప్రకటనలు రావడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.


మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లల్లో రెండు రోజుల పాటు జరిపిన ఐటీ దాడుల్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. కనిపించింది ఎంత, సీజ్‌ చేసింది ఎంత అనేది పక్కనపెడితే.. వందల కోట్ల అక్రమాలు జరిగాయన్నది ఆఫ్‌ ది రికార్డ్‌. పైగా మొన్నటి సోదాల్లో 15 కిలోల బంగారు ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు.వీటికి తోడు పలు కీలక పత్రాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను ఐటీ డిపార్ట్‌మెంట్ స్వాధీనం చేసుకుంది. మల్లారెడ్డి మరదలి కుమారుడు ప్రవీణ్‌ రెడ్డి ఇంట్లో 15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోండగా.. మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో 2 కోట్లు, రఘునందన్ రెడ్డి ఇంట్లో 2 కోట్లు, ప్రవీణ్ కుమార్ ఇంట్లో రెండున్నర కోట్లు, సుధీర్ రెడ్డి ఇంట్లో కోటి సీజ్ చేశారని తెలుస్తోంది.


మంత్రి మల్లారెడ్డిని ప్రశ్నిస్తే సంచలన విషయాలు బయటికొస్తాయని అంచనా వేస్తున్నారు ఐటీ అధికారులు. రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో మల్లారెడ్డి వ్యాపార సంస్థలు, విద్యా సంస్థల విషయంలో సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు.స్వయానా మంత్రి మల్లారెడ్డే.. ఐటీ అధికారుల స్టేట్‌‌మెంట్‌‌లో 100 కోట్ల రూపాయల బ్లాక్‌‌ మనీ ఉన్నట్టు రాసుకున్నారంటూ చెప్పుకొచ్చారు. నిజంగానే ఆ స్టేట్‌మెంట్లో వంద కోట్ల బ్లాక్‌ మనీ ఉందా, మల్లారెడ్డి అలా అనేశారా అనేది తేలాల్సి ఉంది.మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, వ్యాపార సంస్థలు, బంధువుల ఇళ్లపై సోదాలు చేయడానికి ఏకంగా 65 బృందాలు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటేనే.. మల్లారెడ్డి ఏ రేంజ్‌లో ఆస్తులు సంపాదించారో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు.పన్ను ఎగవేతల ఆరోపణల లెక్కలు తేల్చడానికి ఏకంగా 400 మంది అధికారులను తీసుకురావాల్సి వచ్చిందంటే.. ఏ రేంజ్‌లో మల్లారెడ్డి దందా సాగిందో వేరే చెప్పక్కర్లేదంటున్నారు ప్రత్యర్థులు. ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, రియల్ఎస్టేట్‌లో పెట్టుబడులు, ఇతర వ్యాపారాలు.. ఇలా మల్లారెడ్డి అనతికాలంలోనే ఎలా అపర కుబేరుడుగా ఎదిగారన్నది ఐటీ అధికారులు సైతం ఆరా తీస్తున్నారు.మంత్రి మల్లారెడ్డిపై వచ్చిన ఆరోపణలు ఒకట్రెండు కాదు. అసలు తెలంగాణలో ఎవరికీ సాధ్యంకానన్ని కాలేజీలను మల్లారెడ్డి ఒక్కరే ఎలా పెట్టారన్న ప్రశ్న వినిపిస్తోంది. బడా వ్యాపారస్తులకు సైతం సాధ్యంకానన్ని కాలేజీలు మల్లారెడ్డి పేరుతో ఉన్నాయి. అందుకే, మొన్న జరిగిన ఐటీ దాడులు.. మంత్రి మల్లారెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేశాయని చెప్పుకుంటున్నారు.


మంత్రి మల్లారెడ్డిపై అనేక భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో సీట్ల వ్యవహారంపై లెక్క లేనన్ని ఆరోపణలు వచ్చాయి. పన్ను ఎగవేత అంశాలపై ఫిర్యాదులకూ అంతే లేదు. భూముల కొనుగోళ్ల నుంచి కాలేజీల వరకు అన్నింట్లోనూ భారీగా అవకతవకలకు పాల్పడ్డారని గతంలో రేవంత్ రెడ్డి ఐటీ, ఈడీలకు ఫిర్యాదు చేశారు.ఇప్పుడు అవన్నీ బయటకు తీయబోతున్నారు. ఒకప్పుడు పాల వ్యాపారం చేసి, ఇప్పుడు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలకు అధిపతిగా ఎలా మారాన్న గుట్టు మొత్తం విప్పబోతున్నారు. వీటన్నింటి గుట్టు బయటపడితే మల్లారెడ్డి ఇరుక్కుపోయినట్లేనంటున్నాయి ప్రతిపక్షాలు.

Next Story