IT Raid In Hyderabad: వామ్మో.. బీరువాలో ఎన్ని కట్టలో.. అంత డబ్బు ఎలా!!

IT Raid In Hyderabad: వామ్మో.. బీరువాలో ఎన్ని కట్టలో.. అంత డబ్బు ఎలా!!
X
IT Raid In Hyderabad: కష్టపడితే వచ్చిన సొమ్ము కాదా ఏంటి. అంత డబ్బు ఎప్పుడు సంపాదించారు.. ఆశ్చర్యపోతున్నారు ఐటీ అధికారులు సైతం.

IT Raid In Hyderabad: కష్టపడితే వచ్చిన సొమ్ము కాదా ఏంటి. అంత డబ్బు ఎప్పుడు సంపాదించారు.. ఆశ్చర్యపోతున్నారు ఐటీ అధికారులు సైతం. హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో ఐటీ అధికారులు సోదా జరిపారు. ఈ సోదాల్లో 142.87 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

కంపెనీకి సంబంధించి మొత్తం 16 బ్యాంకు లాకర్లతో పాటు.. ఇప్పటి వరకు లెక్కల్లో చూపని 550 కోట్ల రూపాయల ఆదాయాన్ని గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో బీరువా నిండా డబ్బు కట్టలు దర్శనమిస్తున్నాయి.

బీరువాలో బట్టల బదులు డబ్బు కట్టలు కొంచెం కూడా ఖాళీ లేకుండా పెట్టారు. మాక్కూడా కొన్ని కట్టలిస్తే లైఫ్ సెట్ అవుతుందిరా నాయినా అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Tags

Next Story