22 Nov 2022 6:36 AM GMT

Home
 / 
తెలంగాణ / Malla Reddy: మంత్రి...

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ దాడులు..

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ దాడులు..
X

IT Raids : మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బోయినపల్లిలో ఉంటున్న మంత్రి మల్లారెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డి నివాసంలోనూ ఐటీ దాడులు చేస్తోంది. ఇళ్లు, ఆఫీసులతో పాటు మల్లారెడ్డి విద్యాసంస్థలు, ఆస్పత్రులలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు మహేందర్‌ రెడ్డి, భద్రారెడ్డి, మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్‌ కాలేజీలు, అరుంధతి మెడికల్ కాలేజీలోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. సీఆర్‌పీఎఫ్ భద్రత మధ్య ఈ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 50 బృందాలుగా విడిపోయిన అధికారులు.. ఈ తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేస్తున్నారు.

మైసమ్మగూడ, మేడ్చల్ ఏరియాల్లో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, మల్లారెడ్డి యూనివర్సిటీలో సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి కుమారులు, అల్లుడు.. పలు రియల్‌ఎస్టేట్‌ సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మల్లారెడ్డి విద్యాసంస్థల్లోనూ డైరెక్టర్లుగా ఉన్నారు. దీంతో వీరందని ఇళ్లు, ఆఫీసులలో తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Next Story