Malla Reddy: నా వెనక కేసీఆర్.. నాకెందుకు భయం: మల్లారెడ్డి

Malla Reddy: ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కావాలనే తనపై కుట్రలు చేస్తున్నాని ఆరోపించారు. తాను అన్ని వ్యాపారాలు సవ్యంగానే చేస్తున్నానన్నారు. ఇలాంటి కుట్రలకు భయపడబోనని.. తన వెనక సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. ఇక బీజేపీ చర్యలను తిప్పకొడతామని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
మంత్రి మల్లారెడ్డిపై బోయిన్ పల్లి పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ఐటీ అధికారుల ఫిర్యాదుతో మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోదాల సమయంలో మంత్రి తమతో దురుసుగా ప్రవర్తించారని.. ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్స్, డాక్యూమెంట్లను లాక్కున్నారని ఫిర్యాదుతో ఐటీ అధికారులు తెలిపారు. ఐటీ అధికారుల ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు మల్లారెడ్డి తనయడు భద్రారెడ్డి కూడా ఐటీ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడు మహేందర్ రెడ్డిపై సోదాల సమయంలో ఐటీ అధికారులు దాడి చేశారని ఆరోపించారు. తన సోదరుడితో బలవంతంగా సంతకం చేయించుకున్నారని ఫిర్యాదుతో తెలిపారు. భద్రారెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో ఐటీ అధికారులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com