Phoenix Real Estate : ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు..

Phoenix Real Estate : హైదరాబాద్‌లోని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో నగరంలోని 10 చోట్ల అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఫీనిక్స్ కార్యాలయంతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మదాపూర్‌లోని ఫీనిక్స్ ఐటీ సెజ్‌లోనూ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తుండగా.. వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్‌ఫ్రాలోనూ ఫీనిక్స్ పెట్టుబడులు పెట్టింది.
ముంబై నుంచి వచ్చిన ఐటీ అధికారుల ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ దాడులు జరుతున్నట్లు సమాచారం. అయితే.. 25 వాహనాల్లో.. దాదాపు 150 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫీనిక్స్ సంస్థ ఛైర్మన్ చుక్కపల్లి సురేష్ జన్మదిన వేడుకలు నగరంలోని హెచ్‌ఐసీసీలో ఘనంగా జరిగాయి. బర్త్ డే వేడుకలకు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు, కలెక్టర్లు, బాలీవుడ్, టాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు. కాగా.. బర్త్ డే వేడుకలకు భారీ మొత్తంలో డబ్బు వెచ్చించారు. ఈ నేపథ్యంలోనూ ఫీనిక్స్ సంస్థపై ఐటీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com