Jagitial: ఎమ్మెల్యే వేధింపులు భరించలేకే రాజీనామా
జగిత్యాల బీఆర్ఎస్‌లో భగ్గుమన్న విబేధాలు: మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవికి శ్రావణి రాజీనామా

జగిత్యాల బీఆర్ఎస్‌లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రావణి మధ్య గొడవలు ముదిరాయి. దీంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు భరించలేనంటూ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవికి శ్రావణి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సంజయ్ చాలాకాలంగా వేధిస్తున్నారంటూ ఆమె మీడియా ఎదుట కన్నీను పెట్టుకున్నారు. ఎమ్మెల్యే తనను బెదిరించారంటూ శ్రావణి ఆరోపించారు. డబ్బులు కావాలని డిమాండ్ చేశారని.. అయితే తాము డబ్బులు ఇవ్వలేమని చెప్పామన్నారు. తనపై కక్షగట్టిన ఎమ్మెల్యే.. కలెక్టర్‌ను కలవొద్దని ఆదేశించారని.. ఒక్క పని కూడా ప్రారంభించకుండా చేశారని ఆమె గోడు వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు భరించలేక.. మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రావణి ప్రకటించారు.