Jagitial: శ్రావణిని నా కూతురులా చూసుకున్నా..: ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ బోగ శ్రావణి ఎమ్మెల్యే సంజయ్ తనను అడుగడుగునా అడ్డుకుంటున్నాడని, ఆమెను వేధిస్తున్నాడని ఆరోపించి మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే సంజయ్ గురువారం స్పందించారు. శ్రావణిని ఆరోపణలను ఆయన ఖండించారు. ఆమె వస్త్రాధరణపై కామెంట్లు చేస్తున్నాడన్న విషయం పూర్తిగా తప్పని చెప్పారు. శ్రావణిని ఆయన ఎప్పుడూ తన కూతురు లాగే చూశానని తెలిపారు. కానీ ఆమే తనపై కావాలని ఆరోపణలు చేస్తోందని, ఆమె ఇలా మాట్లాడటం తనను ఎంతగానో బాధించిందని వెల్లడించారు.
శ్రావణిని రాజకీయంగా ఎంతగానో ప్రోత్సహించానని అన్నారు. ఆమె పట్ల గత కొన్ని నెలలుగా కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఆమెపై కౌన్సిల్‌లో అసమ్మతి తీర్మానం పెడతామన్నారని అన్నారు. వారి మధ్య సంధి కుదర్చడానికి ఎమ్మెల్యే ప్రయత్నించారని కానీ శ్రావణి ఆయన మాటలు పట్టించుకోలేదని తెలిపారు. ఈ వివాదంపై రాష్ట్ర నాయకత్వం దృష్టిపెట్టిందన్నారు. రాష్ట్ర ఎస్సీ వెల్ఫేర్ మినిష్టర్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, జిల్లా బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com