కోడిని అరెస్టు చేయలేదు.. కేవలం సంరక్షించేందుకే తీసుకువచ్చాం : పోలీసులు

ఓ వ్యక్తి మృతికి కారణమైన కోడిని పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్తల్లో నిజం లేదని అన్నారు జగిత్యాల జిల్లా గొల్లపల్లి ఎస్సై జీవన్.. హత్యకు కారణమైన కోడిని ఎవరూ ఏమీ చేయకూడదనే ఉద్దేశంతోనే పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చామని తెలిపారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. జగిత్యాల జిల్లాలోని కొండపూర్‌కు చెందిన తనుగుల సతీష్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కోడిపందేలు నిర్వహించాడు. అయితే కోడిని పందెంలో దించే సమయంలో కత్తికట్టిన కాలు కాకుండా మరో కాలిని పట్టుకున్నాడు.
అయితే ఆ కోడి తప్పించుకునే ప్రయత్నం చేయగా... దానికి కట్టిన కత్తి సతీశ్పురుషాంగానికి, వృషణాలకు తగిలింది.. దీనితో సతీశ్ ని ఆసుపత్రికి తరలిస్తుండగా అతను మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కాగా ఈ ఘటన పైన ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇక విచారణలో భాగంగా... సతీశ్ మరణించడానికి సదరు కోడి కారణమని తేల్చారు. అయితే ఆ కోడిని ఎవరూ ఏమీ చేయకూడదని, దాన్ని సంరక్షించే బాధ్యత పోలీసులు తీసుకున్నారు. అందులో భాగంగానే సదరు కోడిని కోళ్ల పారంలో అప్పగించారు. అంతేతప్ప కోడిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com