JAGRUTHI: టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన జాగృతి

గ్రూప్ - 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని.. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని జాగృతి నేతలు ముట్టడించారు. గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేయాలని,జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని కమిషన్ కార్యాలయం వైపు దూసుకువచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జాగృతి నేతలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కార్యాలయం ఎదుటే బైఠాయించిన జాగృతి నేతలు.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జాగృతి నేతలు మాట్లాడుతూ గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారని, తిరిగి గ్రూప్ -1 పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ ఉద్యోగులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com