Jagtial: వైద్యుల నిర్లక్ష్యం... గర్భిణులకు శాపం...
jagtial

అప్పుడే పుట్టిన బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుని ముద్దు చేయాల్సిన తల్లులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కుట్లు ఊడిపోయి నరకయాతన అనుభవిస్తున్నారు. బిడ్డను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకోలేక, పాలిచ్చే పరిస్థితి లేక విలవిల్లాడుతున్నారు. ఈ హృదయవిదాకర ఘటన జగిత్యాలలోని మాతాశిశు ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
ఏకంగా 10 మంది మహిళలకు కాన్పు తర్వాత ఒక్కసారిjaగా కుట్లు ఊడిపోయాయి. ఇది కేవలం వైద్యుల నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. మరోవైపు ఒక్కసారిగా ఇంత మంది మహిళలకు కుట్లు విడిపోవడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళనకు విపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకూ, మహిళలకు మెరుగైన వైద్యం అందించే వరకూ నిరసన కార్యక్రమాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై, ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com