అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన జలగం వెంకట్రావ్

అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన జలగం వెంకట్రావ్
తనను కొత్తగూడెం ఎమ్మెల్యేగా పరిగణించాలని కోరిన వెంకట్రావ్ వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదని హైకోర్టు తీర్పు

తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్. తనను కొత్తగూడెం ఎమ్మెల్యేగా పరిగణించాలని కోరారు. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పు కాపీలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదని స్పష్టంచేసింది. దీంతోపాటు కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావ్‌ను ప్రకటించింది. ఎన్నికలవేళ తప్పుడు అఫిడవిట్‌ సమర్పించినట్లు నిర్దారించిన..ధర్మాసనం 5లక్షలు జరిమానా విధించింది. ఎన్నికలప్పుడు అఫిడవిట్‌లో సమర్పించిన కేసులు, ఆస్తులు అబద్దాలని తేల్చింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వనమా..ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పట్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసిన జలగం వెంకట్రావు.. వనమా అఫిడవిట్‌పై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. జలగం వెంకట్రావు పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చిన వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని.. తీర్పునిచ్చింది.

వనమా వెంకటేశ్వరావుపై 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని అభియోగాలున్నాయి. దీనిపై ఆయన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావ్ కోర్టును ఆశ్రయించారు.ఇక వనమా వెంకటేశ్వరరావు తన భార్య పేరు ఉన్న ఆస్తులను ప్రకటించకపోవడంతో పాటు..ఎన్నికల అఫిడవిట్ తో పాటు సమర్పించాల్సిన ఫామ్ 26కు సంబందించిన వివరాలు, అలాగే క్రిమినల్ కేసుల వివరాలు అఫిడవిట్‌లో ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి

Tags

Next Story