PAWAN: నా ఇజం.. హ్యూమనిజం

సనాతనధర్మం, సోషలిజం రెండూ పక్కపక్కన కలిసి నడవచ్చని.. తెలంగాణ ఉద్యమకారులు తెలిపారని ఇప్పుడు అదే స్ఫూర్తితో మోదీ పనిచేస్తున్నారని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో బీజీపీ జనసేన అభ్యర్థులకు మద్దతుగా పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి చూసి చలించిపోయానంటూ.. పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఫ్లోరోసిస్ బాధితులకు మంచినీరు అందించకపోవడం బాధ కలిగించిందని తెలిపారు. తెలంగాణ యువత దగా పడిందని భావించి.. వారి పక్షాన నిలబడేందుకు వచ్చానని, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా అందరిని సమానంగా చూసే నేత ప్రధాని మోదీ అని పవన్ అన్నారు. ధరణి విఫలమైందని ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుందన్న పవన్ కల్యాణ్ కౌలు రైతులు రైతే కాదని చేసిన వ్యాఖ్యలు బాధించిందన్నారు. కౌలు రైతులపై చులకనగా మాట్లడకూడదంటూ హితవు పలికారు. తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్న BC ల నుంచి... BC ముఖ్యమంత్రి కావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందన్నారు. ప్రస్తుతం యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఉపాధి అవకాశాలు వస్తాయని బలంగా విశ్వసిస్తున్నట్లు వివరించారు. తెలంగాణలో 19 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారన్న పవన్ వారు రైతులే కాదని మాట్లాడడం తనకు బాధ కలిగించిందన్నారు. ధరణి విఫలమైందని ప్రభుత్వం కూడా ఒప్పుకుందని తెలిపారు. తెలంగాణలో బీసీని సీఎం చేయగలిగేది మోదీ నేతృత్వంలోని బీజేపీనే అని వివరించిన పవన్.. బీసీ ఎజెండాతో వస్తున్న బీజేపీ కోసం కొంత త్యాగం చేయాలని జనసైనికులకు చెప్పినట్లు వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. ‘ఇదే నా ఇజం.. హ్యూమనిజం’ అని వ్యాఖ్యానించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యులనే స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరముందని చెప్పారు. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జనసైనికులు మద్దతివ్వాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని, దాని కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు కష్టపడ్డాయని అన్నారు. 1200 మంది బలిదానాలు ఇచ్చారని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న యువతకు జనసేన అండగా నిలబడుతుందని పవన్ కల్యాణ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com