Pawan Kalyan : ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
Pawan Kalyan : ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.
BY vamshikrishna20 May 2022 2:30 AM GMT

X
vamshikrishna20 May 2022 2:30 AM GMT
Pawan Kalyan : ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యులకు.. 5 లక్షల చొప్పున బీమా చెక్‌లు అందించనున్నారు. ముందుగా చౌటుప్పల్‌లోని లక్కారంలో కొంగర సైదులు కుటుంబాన్ని పరామర్శిస్తారు పవన్. తర్వాత కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం సూర్యాపేట మీదుగా కోదాడకు వెళ్తారు. అక్కడ కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని ఓదార్చుతారు. అభిమాన నాయకుడు రాక సందర్భంగా పవన్‌కు స్వాగతం చెప్తూ.. ఎన్‌హెచ్-65పై భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జనసేన కార్యకర్తలు. ఉమ్మడి నల్గొండపై మొదట్నుంచి ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్.. ఇప్పుడు కార్యకర్తలకు భరోసా ఇవ్వడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు.
Next Story