గ్రేటర్ బరినుంచి తప్పుకున్న జనసేన

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్. గ్రేటర్ ఎన్నికల సమన్వయంపై చర్చించేందుకు జనసేన - బీజేపీ ముఖ్యనేతలు హైదరాబాద్‌లోని నాదెండ్ల మనోహర్ నివాసంలో భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్‌తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, OBC మోర్చా నాయకులు లక్ష్మణ్ చర్చలు జరిపారు. జనసేనతో పొత్తు లేదని BJP అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించినా ..హైకమాండ్ ఆదేశాలతో ఈ చర్చలు జరిపారు.
ఇక గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడంలేదని, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని తమ పార్టీ నేతల్ని కోరారు పవన్ కల్యాణ్. ఈ సారి హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ - జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. కార్యకర్తలతో కలసి చర్చిస్తామనని, ఎవరూ నిరుత్సాహ పడకూడదన్నారు పవన్ కల్యాణ్. భవిష్యత్తులోనూ బీజేపీతో కలిసి పనిచేస్తామన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ -జనసేన కలిపనిచేస్తాయన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా నేత లక్ష్మణ్. గ్రేటర్ ఎన్నికలే కాదు భవిష్యత్‌లోనూ రెండు పార్టీ కలిసిపనిచేస్తాయన్నారు. దీనికి ఒప్పుకున్నందుకు పవన్‌కు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీతోనే మార్పు సాధ్యమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com